కారులో మహిళ మృతదేహం.. నిందితులు గొయ్యి తవ్వుతుండగా..

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో హైవే వెంట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో మహిళ మృతదేహం కనిపించింది.

By అంజి  Published on  12 May 2024 6:45 PM IST
Tamil Nadu, Crime news, Dindigul

కారులో మహిళ మృతదేహం.. నిందితులు గొయ్యి తవ్వుతుండగా.. 

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో హైవే వెంట పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో మహిళ మృతదేహం కనిపించింది. మహిళ మృతదేహాన్ని పూడ్చేందుకు గొయ్యి తవ్వుతుండగా ఇద్దరు అనుమానితులను పెట్రోలింగ్ బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పెట్రోలింగ్ బృందం అమ్మైనికనూర్ పోలీసులకు సమాచారం అందించింది. వారు అరెస్టులు చేసి, మృతదేహాన్ని కారులోంచి బయటకు తీసి శవపరీక్షకు తరలించారు.

నిందితులను దివాకర్‌, అతని బంధువు ఇంద్రకుమార్‌గా గుర్తించారు. 27 ఏళ్ల ప్రిన్సి అనే బాధితురాలు తిరుప్పూర్‌లోని ఓ ప్రైవేట్ మిల్లులో పనిచేస్తుండడంతో దివాకర్‌తో పరిచయం ఉంది. ప్రాథమిక విచారణ ప్రకారం, ధివాకర్ ప్రిన్సితో సంబంధం కలిగి ఉన్నాడు. అయితే దానిని తెంచుకోవాలని అనుకున్నాడు. నగలు, డబ్బుతో సహా తనకు ఇచ్చిన బహుమతులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

దివాకర్ ప్రిన్సిని పల్లడం వద్దకు రప్పించి, ఆపై నైలాన్ తాడుతో ఆమె గొంతు నులిమి చంపాడు. అనంతరం ఇంద్రకుమార్ మృతదేహాన్ని కారులో తరలించగా, రామనాథపురం నుంచి ద్విచక్రవాహనంపై దివాకర్‌ కారును అనుసరించాడు. ప్రిన్సీ మృతదేహాన్ని మధురై సమీపంలో ఖననం చేయాలని ఇద్దరూ ప్లాన్‌లో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే, హైవే పెట్రోలింగ్ అధికారులు కోడై రోడ్డు సమీపంలో పార్క్ చేసిన వారి వాహనాన్ని తనిఖీ చేయడంతో వారి ప్రణాళికలు విఫలమయ్యాయి, ఇది వారిని అరెస్టు చేయడానికి దారితీసింది. తదుపరి విచారణలు కొనసాగుతోంది.

Next Story