మహిళను అనుచితంగా తాకిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ అరెస్ట్

మహిళను లైంగిక వేధించినందుకు బెంగుళూరులో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ని పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  22 March 2024 10:16 AM IST
Swiggy delivery agent, woman, Bengaluru, arrest

మహిళను అనుచితంగా తాకిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ అరెస్ట్

మహిళను లైంగిక వేధించినందుకు బెంగుళూరులో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ని అరెస్టు చేశారు. అతను ఆర్డర్ డెలివరీ చేయడానికి తన ఇంటికి వచ్చినప్పుడు అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనను అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) ప్రకారం ఈ సంఘటన మార్చి 17న జరిగింది. డెలివరీ ఎగ్జిక్యూటివ్ అయిన ఆకాష్ సాయంత్రం 6.30 గంటలకు ఆరుషి మిట్టల్ (ఫిర్యాదుదారు) ఇంటికి ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేశాడు.

అతను మొదట బాత్రూమ్‌ను ఉపయోగించకోవచ్చా? అని ఆరుషి మిట్టల్‌ని అడిగాడు. ఈ క్రమంలోనే అతడు ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తరువాత తాగునీరు కూడా అడిగాడు. ఫిర్యాదుదారురాలు నీరు తీసుకురావడానికి వంటగదికి వెళ్లినప్పుడు, అతను ఆమెను వెనుక నుండి కౌగిలించుకుని, ఆమె చేయి కూడా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతని చర్యకు షాక్‌కు గురైన సదరు మహిళ.. అతడిని అరుస్తూ చెంపదెబ్బ కొట్టిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో, డెలివరీ ఎగ్జిక్యూటివ్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని 354ఏ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు.

Next Story