కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన యువకుడు.. చివరకు ఏమయ్యాడంటే.!

Suspicious death of a young man in Madhya Pradesh. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో ఓ బావిలో కాలిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

By M.S.R  Published on  23 Feb 2022 10:28 AM GMT
కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన యువకుడు.. చివరకు ఏమయ్యాడంటే.!

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో ఓ బావిలో కాలిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతదేహం కాలిపోయిన తర్వాత గోనె సంచిలో వేసి ఉంచారు. మృతదేహాన్ని గ్రామానికి చెందిన కొత్వార్‌ కుమారుడిగా గుర్తించారు. కొత్వార్ కుమారుడు ఫిబ్రవరి 15 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.

బేతుల్‌లోని చిచోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్‌బరి గ్రామంలోని పొలంలో ఉన్న పాత బావిలో మృతదేహం గోనె సంచిలో కనుగొనబడింది. మృతదేహంలో సగం గోనె సంచిలో ఉండగా, సగం బయట ఉంది. మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించింది. ఫిబ్రవరి 15 రాత్రి నుండి కైలాష్ తప్పిపోయాడని, పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయిన వ్యక్తికి సంబంధించి ఫిర్యాదు నమోదు చేసినట్లు చెబుతున్నారు. మృతదేహం కాలిపోయిందని చిచోలి పోలీసు అధికారి అజయ్ సోనీ తెలిపారు.

ప్రాథమికంగా చూస్తే ఈ ఘటన హత్యగా కనిపిస్తోంది. కైలాష్ మానసిక పరిస్థితి బాగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి పేరు కైలాష్ అని టిఐ చిచోలి అజయ్ సోనీ తెలిపారు. 'ఫిబ్రవరి 15 నుంచి కైలాష్ కనిపించకుండా పోయాడుని.. సాయంత్రం కుటుంబసభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో కైలాష్ ఉబనారేకు చెందిన పొలం బావిలో మృతదేహం లభ్యమైంది' అని కుటుంబ సభ్యుడు పరస్రామ్ ఖతార్కర్ చెబుతున్నారు.

Next Story
Share it