పిల్లలకు బిస్కెట్లు కొని ఇంటికి తిరిగి వస్తుండగా.. భర్తే కాలయముడై!!
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రగతి నగర్ సమీపంలో శనివారం సాయంత్రం 35 ఏళ్ల మహిళను ఆమె భర్త హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
By అంజి
పిల్లలకు బిస్కెట్లు కొని ఇంటికి తిరిగి వస్తుండగా.. భర్తే కాలయముడై!!
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రగతి నగర్ సమీపంలో శనివారం సాయంత్రం 35 ఏళ్ల మహిళను ఆమె భర్త హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు శారద (35) తన పిల్లలకు బిస్కెట్లు కొని ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమె భర్త కృష్ణప్ప ఆమెపై దాడి చేశాడు.
కర్ణాటకలోని బాగేపల్లికి చెందిన కృష్ణప్ప తాగుడుకు అలవాటు పడ్డాడు, అతనికి భార్యతో వివాదాలు ఉన్నాయి. ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు. దీంతో ఈ జంట తాత్కాలికంగా విడిపోయారు. కానీ రెండు నెలల క్రితం రాజీ పడ్డారు. అయినా కూడా కృష్ణప్ప ఆమెను అనుమానించడం మానలేదు. శనివారం సాయంత్రం కోపంతో అతను శారదను రోడ్డుపై అడ్డగించి కత్తితో దాడి చేశాడు. నేరం జరిగిన ప్రదేశం నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు, కానీ స్థానికులు అతన్ని వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ ఈస్ట్) సారా ఫాతిమా, ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
"రాత్రి 8 గంటల ప్రాంతంలో కంట్రోల్ రూమ్ కు కాల్ వచ్చింది. మా పెట్రోలింగ్ పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించగా, మృతురాలు 35 ఏళ్ల శారదగా గుర్తించారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు" అని డీసీపీ సారా ఫాతిమా తెలిపారు.
"మేము ఇప్పుడే కేసు నమోదు చేసాము మరియు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ హత్య వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని గుర్తించగలుగుతాము. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు మరియు పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలను వెల్లడిస్తామని" డీసీపీ అన్నారు.