మాట వినని కూతురు.. ప్రెషర్ కుక్కర్ తో బాది చంపేసిన తండ్రి

తన మొబైల్ ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ ఇంటి పనులను పట్టించుకోలేదని 40 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్ తన 18 ఏళ్ల కుమార్తెను ప్రెషర్ కుక్కర్‌తో తలపై బాది చంపాడని పోలీసులు తెలిపారు.

By Kalasani Durgapraveen  Published on  30 Nov 2024 8:00 AM IST
మాట వినని కూతురు.. ప్రెషర్ కుక్కర్ తో బాది చంపేసిన తండ్రి

తన మొబైల్ ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ ఇంటి పనులను పట్టించుకోలేదని 40 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్ తన 18 ఏళ్ల కుమార్తెను ప్రెషర్ కుక్కర్‌తో తలపై బాది చంపాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని శుక్రవారం నాడు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్‌లోని భరిమాత రోడ్‌లో నివాసం ఉంటున్న యువతి తల్లి గీతాబెన్ పర్మార్, పొరుగున ఉన్న ఒక మాల్‌లో పనిచేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం, గీత తన కుమార్తె హేతాలిని తన భర్త ముఖేష్ పర్మార్‌తో విడిచిపెట్టి పనికి బయలుదేరిందని. అతను అనారోగ్యం కారణంగా ఇంట్లో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

గీత తన కూతురిని ఇంటి పనులు పూర్తి చేయమని చెప్పేసి వెళ్ళింది. అయితే ఆమె వాటిని పట్టించుకోకుండా ఫోన్‌లో గేమ్‌లు ఆడుతుండడంతో తండ్రి లేచి ఆమె తలపై, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రంగా కొట్టి గాయపరిచాడని పోలీసులు తెలిపారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాధితురాలి తమ్ముడు మయాంక్ (13) తన సోదరి కేకలు విని లోపలికి పరిగెత్తుకెళ్లి చూడగా అప్పటికే ఆమె శరీరం మొత్తం రక్తంతో నిండిపోయిందని పోలీసులు తెలిపారు. మయాంక్ నుండి కాల్ అందుకున్న గీత ఇంటికి పరుగెత్తింది. హేతాలిని SMIMER ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చౌక్ బజార్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ వివి వాఘడియా మాట్లాడుతూ “ఇల్లు శుభ్రం చేయాలనే తండ్రి సూచనలను ఆమె పట్టించుకోకపోవడంతో ముఖేష్ కు, కుమార్తె మధ్య గొడవ జరిగింది. కోపంతో ముఖేష్ ఆమెను ప్రెషర్ కుక్కర్‌తో పదే పదే కొట్టాడు, ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది" అని తెలిపారు.

Next Story