ఇటీవల కాలంలో కొంత మంది చిన్న చిన్న విషయాలకే తమ జీవితాలను ముగించుకుంటున్నారు. క్షణం ఆలోచించకుండా ప్రాణాలు తీసుకుని.. కుటుంబ సభ్యులను తీవ్ర రోదనకు గురి చేస్తున్నారు. తాజాగా సైన్స్ సబ్జెక్టు నచ్చలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని వియాపుర జిల్లాలో మంగళవారం వెలుగు చూసింది. మృతి చెందిన విద్యార్థిని 17 ఏళ్ల యువతిగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగసుగూర్ తాలూకాలోని కోమలాపురానికి చెందిన పద్మావతి నాగరబెట్టలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతోంది.
విద్యార్థిని బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది లోపలికి వెళ్లి చూశారు. యువతి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి నుండి పోలీసులు డెత్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో '' క్షమించండి.. నాకు సైన్స్ సబ్జెక్ట్ నచ్చదు అందుకే నా జీవితాన్ని ముగించుకుంటున్నాను'' అని పేర్కొంది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ముద్దెబిహాల్ పోలీసులు అసలు.. ఆ యువతి ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన కారణాలపై సమాచారం సేకరిస్తున్నారు.