తల్లిదండ్రులు స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

Student commits suicide as parents refuse to buy him a mobile in East Godavari. స్మార్ట్ ఫోన్ కొనడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో పాలిటెక్నిక్ చదువుతున్న 18 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న

By అంజి  Published on  1 March 2022 11:54 AM GMT
తల్లిదండ్రులు స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య

స్మార్ట్ ఫోన్ కొనడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో పాలిటెక్నిక్ చదువుతున్న 18 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన తూర్పుగోదావరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసపూడికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న అతని కొడుకు ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్ కావాలని అడిగాడు.

అయితే, రెండు రోజుల్లో అతనికి స్మార్ట్‌ఫోన్ కొనిస్తానని అతని తల్లి అతనిని ఒప్పించింది. ఆ సమయంలో తండ్రి కూలీ పనులకు వెళ్లగా.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు రామచంద్రాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బంది, మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కుమారుడి ఆత్మహత్యతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Next Story
Share it