బాలిక స్నానం చేస్తుండ‌గా స‌వతి తండ్రి ఏం చేశాడంటే..?

Step Father Molested daughter in Vijayawada.ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. బ‌య‌టివారి నుంచే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Feb 2022 3:03 AM GMT
బాలిక స్నానం చేస్తుండ‌గా స‌వతి తండ్రి ఏం చేశాడంటే..?

ఇటీవ‌ల కాలంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. బ‌య‌టివారి నుంచే కాదు కుటుంబ స‌భ్యుల నుంచి సైతం వేదింపులు ఎదుర్కొంటున్నారు. కొంద‌రు కామాంధులు వావి వ‌రుస‌లు మ‌రిచిపోయి ఆకృత్యాలకు పాల్ప‌డుతున్నారు. కూతురు వ‌రుసైన అయిన ఓ బాలిక ప‌ట్ల ఓ స‌వతి తండ్రి అనుచితంగా ప్ర‌వ‌ర్తించాడు. బాలిక స్నానం చేస్తుండ‌గా ర‌హ‌స్యంగా వీడియో చిత్రీక‌రించాడు. విష‌యాన్ని గ‌మ‌నించిన బాలిక త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ దారుణ ఘ‌ట‌న విజ‌య‌వాడ‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. వన్‌టౌన్‌ గట్టు వెనుక ప్రాంతానికి చెందిన ఓ మహిళకు కుమారుడు, కూతురు ఉన్నారు. మ‌న‌స్ప‌ర్థ‌లతో భ‌ర్త‌తో విడిపోయింది. అనంత‌రం రెండో వివాహం చేసుకుంది. రెండో భ‌ర్త‌, పిల్ల‌ల‌తో క‌లిసి ఒకే ఇంట్లో ఉంటోంది. ఆమె కుమారై ఓ పాఠ‌శాల‌లో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఈ నెల 4న బాలిక స్నానం చేస్తుండ‌గా స‌వతి తండ్రి వీడియో చిత్రీక‌రించాడు. కాగా.. గురువారం ఉద‌యం రెండో భ‌ర్త ఫోన్‌లో మ‌హిళ ఫోటోలు చూస్తుండ‌గా.. కుమారై స్నానం చేస్తున్న వీడియో క‌నిపించింది. ఈ విష‌య‌మై భ‌ర్త‌ను నిల‌దీసింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. అనంత‌రం ఈ ఘ‌ట‌న‌పై బాలిక త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story