పొలంలో సామూహిక అత్యాచారం.. గర్భందాల్చిన మూగ బాలిక

Speech-impaired teenager sexual assault, made pregnant. వినికిడి, మాటల లోపం గల 19 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత బాలిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించగా

By అంజి  Published on  25 Jan 2022 4:11 AM GMT
పొలంలో సామూహిక అత్యాచారం.. గర్భందాల్చిన మూగ బాలిక

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిన అత్యాచార కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల వినికిడి, మాటల లోపం గల 19 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత బాలిక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించగా, ఆమె తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావం గురించి ఫిర్యాదు చేస్తూ సామూహిక అత్యాచారానికి గురైందని ఒక అధికారి తెలిపారు. వైద్యులు ఆమెకు చేసిన వైద్య పరీక్షలో గర్భవతిగా ఉన్నట్లు గుర్తించడంతో.. వారు స్థానిక పోలీసులకు, జిల్లా పరిపాలనకు సమాచారం అందించారు. ఆమె నేరానికి ఎలా బలైందో తెలుసుకోవడానికి సంకేత భాషా నిపుణుడిని ఏర్పాటు చేసిందని అతను చెప్పాడు.

సంకేత భాషా నిపుణులతో తన ఇంటరాక్షన్‌లో, టీనేజ్ బాధితురాలు రెండు నెలల క్రితం వ్యవసాయ పొలంలో పని చేస్తున్నప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని భిల్వారా కలెక్టర్ ఆశిష్ మోడీ తెలిపారు. అత్యాచార బాధితురాలు గర్భం దాల్చడం వల్ల ఆమెకు అబార్షన్ చేయవలసి వచ్చిందని, బాలికను ఆసుపత్రిలో చేర్పించి క్షేమంగా ఉన్నారని ఆశిష్‌ మోదీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలు ప్రారంభించారని, నిందితుల కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

Next Story