విషాదం.. చివరిసారిగా తల్లికి బై చెప్పి.. కొడుకు ఆత్మహత్య

Son bids adieu to mom and commits suicide in Vizag. విశాఖపట్నంలోని మల్కాపురంలో అప్పులు తీర్చలేకపోతున్నానని.. మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on  29 Sept 2022 8:30 PM IST
విషాదం.. చివరిసారిగా తల్లికి బై చెప్పి.. కొడుకు ఆత్మహత్య

విశాఖపట్నంలోని మల్కాపురంలో అప్పులు తీర్చలేకపోతున్నానని.. మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 62వ వార్డు అల్లూరి సీతారామరాజు కాలనీ (ఎఎస్‌ఆర్‌ కాలనీ)లో గట్టు రాజేష్‌ (25) తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు. రాజేష్ తన స్నేహితుల వద్ద కొంత అప్పు తీసుకున్నాడు. దీనికి తోడు తండ్రి సంపాదనతో కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ఇంటి అవసరాల కోసం అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు పదే పదే డబ్బులు అడగడంతో మరో మార్గం లేదని, చనిపోవాలని రెండు వారాల క్రితం నిర్ణయించుకున్నాడు.

అప్పులు తీర్చలేకపోవడంతో రాజేష్ కుంగిపోయాడు. ఇది గ్రహించిన తల్లి స్థానిక పాస్టర్ వద్దకు తీసుకెళ్లి ఓదార్చింది. అయితే బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో తల్లిని టీ అడిగాడు. తల్లి ఇచ్చిన టీ తాగి, రాజేష్ తన గదిలోకి వెళ్లే ముందు బై బై మమ్మీ అని చెప్పి గదిలోకి వెళ్లి తల్లి చీరకు ఉరివేసుకున్నాడు. ఫ్యాన్‌కు వేలాడుతున్న మృత దేహాన్ని వెలికి తీయడానికి తండ్రి, తల్లి ప్రయత్నించి కొడుకును కాపాడే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story