Hyderabad: సాఫ్ట్‌వేర్‌ భార్యను చంపిన భర్త.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా..

బాచుపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇంటి ఇల్లాల్ని దారుణంగా హత్య చేయడమే కాకుండా దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు ఓ భర్త

By అంజి
Published on : 24 May 2024 9:15 PM IST

Software, murder, Bachupally, Crime

Hyderabad: సాఫ్ట్‌వేర్‌ భార్యను చంపిన భర్త.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా..

హైదరాబాద్‌: బాచుపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఇంటి ఇల్లాల్ని దారుణంగా హత్య చేయడమే కాకుండా దాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు ఓ భర్త.. కానీ పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో ఊచలు లెక్కబెడుతున్నాడు. బాచుపల్లిలో నాగేంద్ర భరద్వాజ్, మధులత దంపతులు నివాసం ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఇటీవల ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు చెలరేగాయి. ప్రతిరోజు ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండడంతో విసుగు చెందిన నాగేంద్ర తన భార్య మధులతను హత్య చేశాడు.

భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ పోలీసుల చేతికి చిక్కుతానని భయపడి.. మధులత మరణాన్ని... గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అది కూడా వీలు కాలేదు.. మధులత మరణించినట్టుగా తల్లిదండ్రులకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మధులత తండ్రి రంగనాయకులకు అల్లుడు మీద అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించి నిందితుడు రాజేంద్ర భరద్వాజను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story