చెరువులో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మ‌హ‌త్య‌

Software Engineer Committed suicide by jumping into pond.ఇటీవ‌ల కాలంలో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే వారి సంఖ్య

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2022 2:51 PM IST
చెరువులో దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మ‌హ‌త్య‌

ఇటీవ‌ల కాలంలో ఆత్మ‌ హ‌త్య‌లు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఏదైనా చిన్న స‌మ‌స్య వ‌చ్చినా చాలు.. చావే శ‌ర‌ణ్యం అని బావిస్తుండ‌డ‌మే అందుకు కార‌ణం. హైదరాబాద్‌లో జాబ్ వ‌చ్చింద‌ని, ఉద్యోగంలో జాయిన్ అవుతాన‌ని చెప్పి ఇంట్లోంచి వ‌చ్చిన ఓ యువ‌తి చెరువులో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి మండ‌లం నువులూరుకు చెందిన శ్వేత‌(22) స్టాఫ్‌వేర్ ఇంజినీర్‌. గ‌త మూడు నెల‌లుగా ఇంటి నుంచే ప‌ని చేస్తోంది. మ‌రో కంపెనీలో ఉద్యోగం వ‌చ్చింది. ఆదివారం కొత్త ఉద్యోగంలో జాయిన్ కావాల్సి ఉంది. ఈ క్ర‌మంలో శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఇంటి నుంచి బ‌య‌లుదేరింది. రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో తాను డిప్రెషన్ లో ఉన్నానని, ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు వాట్సాప్‌లో త‌ల్లికి మెసేజ్ పంపింది.

ఆందోళ‌నగురైన త‌ల్లిదండ్రులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు గాలింపు చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం చిల్ల‌ప‌ల్లి చెరువులో శ్వేత మృత‌దేహాన్ని గుర్తించారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జ‌గ్గ‌య్య పేట ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story