భర్తకు అనారోగ్యం.. బంధువుల బిడ్డను నరబలి ఇచ్చిన భార్య
Six Months Baby killed in Thanjavur.టెక్నాలజీ ఇంతగా అభివృద్ది చెందిన నేటి కాలంలో కూడా కొందరు మూఢనమ్మకాలను
By తోట వంశీ కుమార్ Published on 18 Dec 2021 6:59 AM GMTటెక్నాలజీ ఇంతగా అభివృద్ది చెందిన నేటి కాలంలో కూడా కొందరు మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను వీడడం లేదు. భర్త అనారోగ్యానికి గురైతే.. ఆస్పత్రిలో చూపించాల్సింది పోయి.. ఓ మాంత్రికుడిని సంప్రదించి ఓ భార్య. నరబలి ఇస్తేనే భర్త ఆరోగ్యం కుదటపడుతుందని అతడు చెప్పడంతో.. ఆరు నెలల చిన్నారిని బలి ఇచ్చింది. ఈ విషాద ఘటన తంజావూరు జిల్లా మల్లిపట్టణం సమీపంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల వేరకు.. మల్లిపట్నంకు చెందిన నజ్రుదీన్, ఎన్ షాహిలా దంపతులకు ఐదేళ్ల కుమారుడితో పాటు 6 నెలల కుమార్తె హజారా సంతానం. డిసెంబర్ 15న ఇంటి ముందు ఉన్న పెరటిలోని నీటి తొట్టెలో హజారా విగతజీవిగా కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే చిన్నారి అంత్యక్రియలను నిర్వహించారు. అయితే.. ఆర్నెల్ల పసిపాప నీటి తొట్టిలో ఎలా పండిందన్న సందేహం ఇరుగుపొరుగువారికి వచ్చింది. ఈ విషయం పేరావూరణి పోలీసులకు చేరింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. విచారణలో షాహిలా అత్త షర్మిలా బేగం నీళ్లతో నిండిన టబ్‌లో చిన్నారిని ముంచి హత్య చేసిందని తేలింది.
షర్మిలా బేగం (48), ఆమె భర్త అజరుద్దీన్ (50) ఇటీవల విదేశాల నుంచి వచ్చారు. అయితే.. మల్లిపట్టణానికి వచ్చినప్పటి నుంచి అజరుద్దీన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. రోజు రోజుకు అతడి పరిస్థితి విషమిస్తోంది. దీంతో అతడి భార్య షర్మిలా బేగం పుదుకోట్టై జిల్లా కృష్ణాజీపట్నంకు చెందిన మాంత్రికుడు మహమ్మద్ సలీమ్ (48)ను ఆశ్రయించింది. సలీమ్ సూచన మేరకు బేగం మేకను, కోళ్లను బలి ఇచ్చింది. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడలేదు. నరబలి ఇస్తే ఆరోగ్యం కుదటపడుతుందని అతడు చెప్పాడు. దీంతో షర్మిలా బేగం.. షాహిలా ఇంటి నుంచి శిశువును తీసుకెళ్లి నీటి టబ్‌లో ముంచి చంపివేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ముగ్గురు నిందితులపై ఐపిసి సెక్షన్ 201 (సాక్ష్యం అదృశ్యం కావడం) మరియు 302 (హత్యానేరం) కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు సేతుబావచత్తిరం స్టేషన్ ఇన్‌ఛార్జ్ అన్నాదురై తెలిపారు.