గోడ‌కు రంధ్రం చేసి జువైనల్ హోం నుంచి త‌ప్పించుకున్న ఆరుగురు పిల్ల‌లు

Six children escape after breaking wall of Jaipur institute.జువైనల్ హోమ్ గోడ‌ను బ‌ద్ద‌లు కొట్టి ఆరుగురు పిల్లలు ప‌రారు

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 15 Dec 2022 9:22 AM IST

గోడ‌కు రంధ్రం చేసి జువైనల్ హోం నుంచి త‌ప్పించుకున్న ఆరుగురు పిల్ల‌లు

జువైనల్ హోమ్ గోడ‌ను బ‌ద్ద‌లు కొట్టి ఆరుగురు పిల్లలు ప‌రారు అయ్యారు. ఈ ఘ‌ట‌న రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో చోటు చేసుకుంది.

జైపూర్‌లోని ఆదర్శనగర్‌లోని బాలల సంస్కరణ కేంద్రంలో ఉంటున్న ఆరుగురు చిన్నారులు గోడ‌కు రంధ్రం చేసి మంగ‌ళ‌వారం రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో బ‌య‌ట‌కు వ‌చ్చారు. విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డు వారిని అడ్డుకోబోగా అత‌డిని ప‌క్క‌కు తోసి అక్క‌డి నుంచి పారిపోయారు.

స‌మాచారం అందుకున్న వెంట‌నే ట్రాన్స్‌పోర్ట్ న‌గ‌ర్ పోలీసులు, అధికారులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. భ‌ద్ర‌తాలోపాల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పారిపోయిన చిన్నారుల‌ను ప‌ట్టుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Next Story