షాకింగ్.. చెల్లెలిపై అక్క లైంగిక వేధింపులు

Sister's indecent act with her younger sister.. molestation case registered. పూణెలో ఓ సోదరి తన చెల్లెలిని లైంగికంగా వేధించిన దారుణ ఘటన వెలుగులోకి

By అంజి  Published on  27 Jan 2023 8:12 AM GMT
షాకింగ్.. చెల్లెలిపై అక్క లైంగిక వేధింపులు

పూణెలో ఓ సోదరి తన చెల్లెలిని లైంగికంగా వేధించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలో అక్కపై వేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో 18 ఏళ్ల యువతి చేసిన ఫిర్యాదు ఆధారంగా.. 24 ఏళ్ల అక్కపై కేసు నమోదు చేయబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 ఏళ్ల యువతి, 18 ఏళ్ల యువతి ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వారు విమాననగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో ఉంటున్నారు.

జనవరి 23న ఇంట్లోని డ్రాయింగ్ రూమ్‌లో నిద్రిస్తున్న చెల్లెలిపై అక్క వేధింపులకు పాల్పడింది. అయితే ఆమె తన అక్క బలవంతం చేయడంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుదారు ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ చదువుతోంది. లైంగిక వేధింపులకు పాల్పడిన అక్కకు వివాహమైంది. అక్కకు వివాహామైనా.. చాలా రోజుల నుంచి ఆమె తన తండ్రి వద్దే ఉంటోంది. అక్క తన చేతులను చెల్లెలి శరీరంపై రుద్దడం ప్రారంభించింది. ఆమె ఇంటి హాలులో నిద్రిస్తున్నప్పుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడింది.

నిద్రపోతున్న చెల్లెలికి మొదట్లో ఏం జరుగుతుందో తెలియలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి అక్క తన శరీరాన్ని తడుముతూ కనిపించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. అయినా కూడా అక్క తన చెల్లెల్ని బలవంతం చేసే ప్రయత్నం చేసింది. అయితే చెల్లెలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధితురాలి శరీరాన్ని అక్క అనుచితంగా తాకింది. కౌగిలించుకుంది. చెల్లెలు మొత్తం ఎపిసోడ్‌తో భయాందోళనకు గురైంది. అక్క మాట వినడానికి ఇష్టపడని చెల్లె.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

Next Story