ఆ విష‌యంలో గొడ‌వ‌.. అక్క‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన చెల్లెలు

Sister pours petrol on Sibiling due to conflict over distribution of assets.మాన‌వ సంబంధాలు దిగ‌జారిపోతున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Feb 2022 5:03 AM GMT
ఆ విష‌యంలో గొడ‌వ‌.. అక్క‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన చెల్లెలు

మాన‌వ సంబంధాలు దిగ‌జారిపోతున్నాయి. ప‌రాయి వారి మోజులో ప‌డి, ఆస్తి త‌గాదాల‌తో సొంత‌వాళ్ల‌ను హ‌త‌మార్చేందుకు కూడా వెనుకాడ‌ని దారుణ ప‌రిస్థితులు దాపురించాయి. ఆస్తి వివాదం అక్కా చెల్లెళ్ల మ‌ధ్య చిచ్చు పెట్టింది. ఆస్తి కోసం తోడ‌బుట్టిన అక్క‌పై చెల్లి పెట్రోలు పోసి నిప్పంటించింది. ఈ దారుణ‌ ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. కామారెడ్డి జిల్లా చిన్న‌మ‌ల్లారెడ్డికి చెందిన ధ‌ర్మ‌గౌని రాజ‌గౌడ్‌కు న‌లుగురు కుమారైలు. వీరింద‌రికి వివాహాలు జ‌రిగాయి. న‌లుగురిలో ఒక‌రైన వ‌ర‌ల‌క్ష్మి త‌న ఇద్ద‌రు బిడ్డ‌ల‌తో క‌లిసి మెద‌క్ జిల్లా చేగుంట మండ‌లం వ‌డియారంలో నివాసం ఉంటుంది. సోమ‌వారం సోద‌రి రాజేశ్వ‌రి అక్క వ‌ర‌లక్ష్మి ఇంటికి వ‌చ్చింది. పుట్టింటికి చెందిన అయిదెక‌రాల పంప‌కం విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన రాజేశ్వ‌రి త‌న వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను అక్క వ‌ర‌ల‌క్ష్మి పై పోసి నిప్పంటించింది.

మంట‌ల బాధ‌ను తాళ‌లేక వ‌ర‌ల‌క్ష్మి చెల్లి రాజేశ్వ‌రిని వెళ్లి ప‌ట్టుకుంది. గ‌మ‌నించిన స్థానికులు వ‌చ్చి మంట‌ల‌ను ఆర్పివేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రూ గాయ‌ప‌డ్డారు. వారిద్ద‌రిని ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వ‌ర‌ల‌క్ష్మి ప‌రిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Next Story
Share it