బావ బ్లాక్‌మెయిలింగ్‌.. మరదలు ఆత్మహత్య

Sister-in-law commits suicide because she was upset that her brother-in-law was blackmailing her by taking a video. బీహార్‌లోని నలంద జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అక్క భర్త వేధింపులతో

By అంజి  Published on  10 Feb 2023 2:20 PM IST
బావ బ్లాక్‌మెయిలింగ్‌.. మరదలు ఆత్మహత్య

బీహార్‌లోని నలంద జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అక్క భర్త వేధింపులతో మనస్తాపం చెంది ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఘటనా స్థలం నుంచి పోలీసులకు సూసైడ్ నోట్ కూడా లభించింది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నలంద జిల్లాలోని కరాయపర్షురై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది.

ఇక్కడ ఇంట్లో 21 ఏళ్ల యువతి మృతదేహం వేలాడుతూ కనిపించింది. మృతురాలి అక్కకు గ్రామానికి చెందిన యువకుడితో వివాహమైంది. దీని తర్వాత ఆ యువకుడు ప్రేమ పేరుతో మరదలిని ట్రాప్ చేశాడు. ఆమెపై లైంగిక దాడి చేసి వీడియో తీశాడు. వీడియో తీసిన తర్వాత బాధితురాలిని బావ బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేశాడు. బావ చేష్టల వల్ల యువతి మానసికంగా కుంగిపోయింది. కాగా, గురువారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

కరైపర్షురై పోలీస్ స్టేషన్ దీపక్ కుమార్ మాట్లాడుతూ.. బాలిక మృతదేహం నుండి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అందులో ఆమె మరణానికి అక్క భర్త బాధ్యుడు అని చెప్పింది. ప్రస్తుతం నిందితుడైన ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదే సమయంలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తన చావుకు తన సోదరి భర్తే కారణమని, ఈ విషయం చెబితే కుటుంబ సభ్యులు తనను కొట్టేవారని మృతురాలు సూసైడ్ నోట్‌లో రాసింది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొంది.

Next Story