ఘోరం.. భ‌ర్త ఎదుటే భార్య‌పై సామూహిక అత్యాచారం

Sirohi woman Molested in front of hubby.చోరీకి వ‌చ్చిన న‌లుగురు దుండ‌గులు భ‌ర్త ఎదుటే భార్య‌పై అత్యాచారానికిపాల్ప‌డ్డారు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Nov 2022 9:45 AM IST
ఘోరం.. భ‌ర్త ఎదుటే భార్య‌పై సామూహిక అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికి మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. చోరీకి వ‌చ్చిన న‌లుగురు దుండ‌గులు భ‌ర్త ఎదుటే భార్య‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ దారుణ ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ట్రంలో జ‌రిగింది.

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (పింద్వారా) జేతు సింగ్ తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. సిరోహిలో 45 ఏళ్ల మ‌హిళ త‌న భ‌ర్త‌తో క‌లిసి నివ‌సిస్తోంది. భ‌ర్త వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తున్నాడు. బుధవారం రాత్రి దంపతులు నిద్రించేందుకు సిద్ధమవుతుండగా నలుగురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వారిని బందీలుగా పట్టుకున్నారు. భ‌ర్త‌పై దాడి చేసి అత‌డి వ‌ద్ద ఉన్న రూ.1400 న‌గ‌దును లాక్కున్నారు. మరింత నగదు, ఇతర విలువైన వస్తువులను డిమాండ్ చేశారు, అయితే కొన్ని వెండి ఆభరణాలు తప్ప దంపతుల వద్ద పెద్దగా ఏమీ లేవు.

దీంతో దుండ‌గులు భర్త ఎదుటే భార్య‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌తో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన దంప‌తులు గురువారం ఇంట్లోనే ఉండిపోయారు. శుక్ర‌వారం స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ముగ్గురు నిందితుల‌ను శ‌నివారం అరెస్ట్ చేశారు. ప‌రారీలో ఉన్న నాలుగ‌వ నిందితుడి కోసం గాలిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Next Story