ఉత్తరప్రదేశ్‌లో రైలులో బ్యాగులో ప్రాణాలతో నవజాత శిశువు కనిపించింది. అయితే అదే బ్యాగ్ లోపల దొరికిన సిమ్ కార్డు చివరికి శిశువు కుటుంబ సభ్యుడి ఆచూకీని గుర్తించడంలో అధికారులకు సహాయపడింది. శిశువు జననం గురించి బాధాకరమైన వివరాలను వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ మైనర్ బాలిక తనపై తన తండ్రి అత్యాచారానికి పాల్పడటంతో గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే మైనర్‌ను ఆమె తల్లి వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తీసుకెళ్తుండగా, ఆమె రైలులోని వాష్‌రూమ్‌లో ప్రసవించింది. భయాందోళనకు గురైన వారు నవజాత శిశువును ఒక బ్యాగులో దాచిపెట్టి, జనరల్ కోచ్‌లో వదిలి ఇంటికి తిరిగి వచ్చారు. చివరికి జూన్ 22న ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ స్టేషన్‌లో ఆ బ్యాగ్ కనుగొనబడింది. శిశువును చెకప్, సంరక్షణ కోసం ఆసుపత్రికి తరలించారు.
"జూన్ 22న, సమ్మర్ స్పెషల్ రైలులో ఒక బ్యాగులో ఒక శిశువు ఉన్నట్లు ఫిర్యాదు అందింది. ఆ శిశువును ఆసుపత్రికి తరలించారు. బ్యాగు నుండి బీహార్ నుండి వచ్చిన సిమ్ కార్డును కూడా స్వాధీనం చేసుకున్నారు" అని మొరాదాబాద్ జంక్షన్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీస్ (GRP) స్టేషన్ హెడ్ రవీంద్ర వశిష్ట తెలిపారు. బాధితురాలిని చివరికి కోర్టు ముందు హాజరుపరిచారు. అక్కడ ఆమె తన తండ్రి తనపై అత్యాచారం చేశాడని వెల్లడించింది. తండ్రిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద అభియోగాలు మోపినట్లు వశిష్ఠ తెలిపారు. "బాధితురాలిని కోర్టులో హాజరుపరిచి, వాంగ్మూలాలు నమోదు చేశారు, అందులో బాధితురాలి తండ్రి అత్యాచారం చేశాడని చెప్పబడింది. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది" అని వశిష్ట తెలిపారు. దర్యాప్తును బీహార్‌కు బదిలీ చేశారు, స్థానిక అధికారులు, రైల్వే పోలీసులు కలిసి మరిన్ని సమాచారాన్ని వెలికితీసేందుకు కృషి చేస్తున్నారు.