సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Siddipet Road accident.. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లాకు చ ఎందిన బయ్యాపు

By సుభాష్  Published on  4 Dec 2020 1:33 PM GMT
సిద్ధిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లాకు చ ఎందిన బయ్యాపు నరేందర్‌రెడ్డి (40) న్యాయవాది, ఆయన తండ్రి రాజిరెడ్డి (61),తల్లి విజయ (58)తో కలిసి కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో సిద్ధిపేట శివారు రంగిలా చౌరస్తా సమీపంలోని రహదారి పక్కన ఉన్న కల్వర్టును కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఆ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఇక ఈ ప్రమాదం చోటు చేసుకున్న కొద్దిసేపటికే అదే రోడ్డలో వస్తున్న డీసీఎం వాహనం గుమిగూడిన జనాలపై దూసుకెళ్లింది. దీంతో చిన్నకొడూరు మండలం రాముని పట్లకు చెందిన మల్లేశం (41), సిద్దిపేట మండలం మందపల్లి గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి (50)లు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంత మందికి గాయాలు కాగా, ఈ ప్రమాదంలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story
Share it