దారుణం.. ఆవుపై అత్యాచారం.. మృతి చెందిన మూగ జీవి

Shocking Incident in Yanam.కామంతో క‌ళ్లు మూసుకుపోయి వావీ, వరుస‌ల‌ను మ‌రిచి దారుణంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2023 8:54 AM IST
దారుణం.. ఆవుపై అత్యాచారం.. మృతి చెందిన మూగ జీవి

కామంతో క‌ళ్లు మూసుకుపోయి వావీ, వరుస‌ల‌ను మ‌రిచి దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు కొంద‌రు. మూగ జీవాల‌ను సైతం వ‌ద‌ల‌డం లేదు. అర్థ‌రాత్రి కొంద‌రు దారుణానికి తెగ‌బ‌డ్డారు. ఆవుపై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఆవు మృతి చెందింది. ఈ దారుణ ఘ‌ట‌న యానాంలో జరిగింది.

యానాంలో పొగాకు ఈశ్వ‌ర‌రావు అనే రైతు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. జాతీయ ర‌హ‌దారికి ఆనుకుని ఆయ‌న‌కు కొబ్బ‌రితోట ఉంది. ఆ తోట‌లోనే త‌న ఆవుల‌ను క‌ట్టేసేవాడు. బుధ‌వారం కూడా అలా క‌ట్టేసి ఇంటికి వెళ్లాడు. అయితే.. బుధ‌వారం రాత్రి కొంద‌రు కొబ్బ‌రితోట‌లో ప్ర‌వేశించి ఓ ఆవు నాలుగు కాళ్ల‌ను, మెడ‌ను క‌ట్టేసి లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఆ చోటులో గంజాయి తాగిన ఆన‌వాళ్లున్నాయి.

గురువారం తెల్ల‌వారుజామున తోట‌కు వెళ్లిన ఈశ్వ‌ర‌రావుకు ఆవు చ‌నిపోయి ఉండ‌డం గ‌మ‌నించాడు. వెంట‌నే యానాం పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చాడు. జంతుల‌తో లైంగిక చ‌ర్య‌కు పాల్ప‌డటం చ‌ట్టరీత్యా తీవ్ర‌మైన నేరం అని, దుండ‌గుల‌ను శిక్షించాల‌ని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉండాలంటే గ‌స్తీ పెంచాల‌ని పోలీసుకు విజ్ఞ‌ప్తి చేశారు.

Next Story