జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆరుగురు పర్యాటకులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురు స్థానికులు కాగా, ముగ్గురు స్థానికేతరులు ఉన్నట్లు తెలుస్తుంది. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని కొండ ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సమాచారం మేరకు భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని కొండ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. గాయపడిన పర్యాటకులను చికిత్స నిమిత్తం తరలించినట్లు సమాచారం.
జూలై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుండటం గమనార్హం. అటువంటి పరిస్థితిలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం.. ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడను సూచిస్తుంది. ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్రను ప్రభావితం చేయాలని భావిస్తున్నట్లు దాడిని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు, భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు ఎంత మంది.? ఈ దాడి ఎలా జరిగింది.? అనే విషయమై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు.