'అతడి కోసమే ముగ్గురిని చంపేసింది'.. అమీన్పూర్ పిల్లల హత్య కేసులో సంచలన విషయాలు

భర్త, ముగ్గురు పిల్లలతో ఆమె సంసారం సాఫీగా సాగిపోతోంది. అదే సమయంలో ఆమెకు తన చిన్న నాటి స్నేహితుడు కలిశాడు.

By అంజి
Published on : 2 April 2025 11:49 AM IST

Ameenpur, childrens murder case, Crime

'అతడి కోసమే ముగ్గురిని చంపేసింది'.. అమీన్పూర్ పిల్లల హత్య కేసులో సంచలన విషయాలు

హైదరాబాద్‌: భర్త, ముగ్గురు పిల్లలతో ఆమె సంసారం సాఫీగా సాగిపోతోంది. అదే సమయంలో ఆమెకు తన చిన్న నాటి స్నేహితుడు కలిశాడు. ఇదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆమెకు తన చిన్ననాటి స్నేహితుని చూసి ప్రేమ పుట్టింది. ప్రేమ కోసం ఏమైనా చేయాలనుకుంది‌. అందుకు ముగ్గురు కుమారులను అంతం చేయడమే కాకుండా.. తనకు ఆరోగ్యం బాలేదని నాటకమాడింది. పోలీసులకు భర్త మీద అనుమానం వచ్చే విధంగా చేసింది. కానీ చిన్న తప్పు ఆమెను పట్టించింది. ఈ ఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

తాజాగా అమీన్పూర్ పిల్లల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజిత, చెన్నయ్య దంపతులు.. వీరికి సాయి కృష్ణ(12), మధుప్రియ (10), గౌతమ్ (08) అనే ముగ్గురు కుమా రులు ఉన్నారు. గత నెల 27వ తేదీన రజిత రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగన్నంలో విషం కలిపి తన ముగ్గురు పిల్లలకు తినిపించి, ఆ తర్వాత రజిత ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు అనుమానించింది. భర్త చెన్నయ్య ఇంటికి తిరిగి వచ్చి చూడగా పిల్లలు చనిపోయి కనిపించారు. భార్య రజిత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అది గమనించిన భర్త చెన్నయ్య వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. అనంతరం భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు.

అయితే తాను షాపు నుండి పెరుగు తీసుకు వచ్చి పిల్లలకు తినిపించి తాను తిన్నానని పెరుగులో ఏమీ కలపలేదని తన పిల్లలు బాగానే ఉన్నారా అంటూ పోలీసులను ప్రశ్నించింది. అయితే ముగ్గురు పిల్లలను చంపి భార్య రజితను చంపేందుకు భర్త చెన్నయ్య ప్రయత్నం చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు తమదైన శైలిలో రజితను ప్రశ్నిం చారు. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం ఆ కుటుంబాన్ని చెల్లా చెదురు చేసింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను బలి తీసుకుంది.

అసలు ఏం జరిగిందంటే?

రజిత తన భర్త చెన్నయ్య, ముగ్గురు పిల్లలతో సంతోషం గా గడుపుతోంది. అయితే ఇటీవల పదవ తరగతి క్లాస్ విద్యార్థుల గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. ఆ పార్టీకి వెళ్లిన రజితకు చిన్న నాటి స్నేహితుడు కలిశాడు. అతనితో రజిత మళ్లీ పరిచయం మొదలుపెట్టింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి చేసింది. ఎంతగా అంటే ప్రియుడి కోసం ఏమైనా చేయడానికి సిద్ధమైంది రజిత. ప్రియుడితో కలిసి జీవితం పంచుకోవాలని అనుకుంది. అందుకొరకు భర్త చెన్నయ్య, ముగ్గురు పిల్లల్ని అంతం చేయాలని ప్లాన్ వేసింది. పథకం ప్రకారమే షాప్ నుండి పెరుగు తీసుకువచ్చి అందులో విషం కలిపింది. కానీ భర్త చెన్నయ్య పెరుగన్నం తినకుండానే బయటికి వెళ్లిపోయాడు.

మిగిలిన తన ముగ్గురు పిల్లలకి పెరుగన్నం తినిపించి పిల్లల్ని హత్య చేసింది. భర్త వచ్చే సమయానికి తనకు విపరీతంగా కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి తీసుకువెళ్ళమని నటించింది. ఆమె పర్ఫామెన్స్ చూసి అది నిజమని నమ్మిన భర్త చెన్నయ్య వెంటనే భార్య రజితను ఆస్పత్రికి తరలించాడు. కానీ తీరా చూస్తే ఆమెకు కడుపు నొప్పి లేదు.. ఏమీ లేదు‌.. కేవలం అక్రమ సంబంధం కోసమే భర్త, పిల్లలను హత్య చేయడానికి పూనుకుంది ఈ కసాయి తల్లి... ఈ విషయాలు మొత్తం వెలుగులోకి రావడంతో పోలీసులు రజితను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు..

Next Story