Vijayawada : రైల్వే స్టేషన్‌లో రూ. 7.48 కోట్ల విలువైన బంగారం ప‌ట్టివేత‌

Seizure of gold worth Rs 7.48 crores. విజయవాడ రైల్వే స్టేషన్‌లో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు

By M.S.R  Published on  22 March 2023 3:45 PM GMT
Vijayawada : రైల్వే స్టేషన్‌లో రూ. 7.48 కోట్ల విలువైన బంగారం ప‌ట్టివేత‌

Seizure of gold worth Rs 7.48 crores


విజయవాడ రైల్వే స్టేషన్‌లో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి ఏపీకి పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోదాలు నిర్వహించగా బంగారం బయటపడింది.

పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 5 కేజీల బంగారం లభించింది. వారిని ప్రశ్నించగా మరికొందరి సమాచారం లభించింది. పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకోగా 7.97 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 12.97 కిలోల బంగారాన్ని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 7.48 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన బంగారంలో కొంత బిస్కెట్ల రూపంలో ఉండగా, మరికొంత ఆభరణాల రూపంలో ఉంది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.


Next Story