హాస్టల్‌లో దారుణం.. సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం.. బాలిక అరుపులతో ఒక్కసారిగా..

Security guard held for sexually harassing Class 8 student at govt school in Tamilnadu. తమిళనాడులోని కారైకాల్‌లో దారుణం జరిగింది. 8వ తరగతి విద్యార్థినిపై సెక్యూరిటీ గార్డు లైంగిక వేధింపులకు

By అంజి
Published on : 18 Nov 2022 1:42 PM IST

హాస్టల్‌లో దారుణం.. సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం.. బాలిక అరుపులతో ఒక్కసారిగా..

తమిళనాడులోని కారైకాల్‌లో దారుణం జరిగింది. 8వ తరగతి విద్యార్థినిపై సెక్యూరిటీ గార్డు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కారైకల్ జిల్లాలో 25 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించారు. ఈ పాఠశాలలో పదేళ్లుగా గార్డుగా పనిచేస్తున్న నిందితుడు మహ్మద్ అలీ ఎప్పటిలాగే ఉదయం విద్యార్థులను నిద్ర లేపేందుకు వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ నిద్రిస్తున్న 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

విద్యార్థిని అరుపులు విని వసతి గృహంలో ఉన్న ఇతర విద్యార్థులు లేచారు. భయంతో ఒక్కసారిగా అరిచారు. ఆ వెంటనే విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కోటుచ్చేరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహ్మద్ అలీని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మహ్మద్ అలీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కారైకల్ కోర్టులో హాజరుపరిచి పుదుచ్చేరి జైలులో ఉంచారు. స్కూల్‌లో స్కూల్ వాచ్‌మెన్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన.. పాఠశాలల భద్రత గురించి తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.

Next Story