కాకినాడ జిల్లాలో ఎస్సై ఆత్మహత్య కలకలం రేపుతోంది. కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై గోపాల కృష్ణ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న సీఎం బందోబస్తుకు వెళ్లి వచ్చారు. భార్య, పిల్లలు నిద్రిస్తుండగా.. తెల్లవారుజామున తుపాకీతో కాల్చుకున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ సమీపంలోని జగ్గయ్య చెరువుకు చెందిన గోపాలకృష్ణ 2014లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో కాకినాడలో ట్రాఫిక్ విభాగంలో పనిచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జీజీహెచ్‌ను సందర్శించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.