Crime : తెల్లాపూర్‌లో డ‌బుల్ మ‌ర్డ‌ర్‌

సంగారెడ్డి జిల్లాలో డ‌బుల్ మ‌ర్డ‌ర్‌ కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని తెల్లాపూర్ ప్రాంతంలో ఈ జంట హత్యలు జ‌రిగాయి.

By -  Medi Samrat
Published on : 25 Dec 2025 7:09 PM IST

Crime : తెల్లాపూర్‌లో డ‌బుల్ మ‌ర్డ‌ర్‌

సంగారెడ్డి జిల్లాలో డ‌బుల్ మ‌ర్డ‌ర్‌ కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని తెల్లాపూర్ ప్రాంతంలో ఈ జంట హత్యలు జ‌రిగాయి. వివరాల్లోకి వెళ్తే.. మహిళతో పాటు 13 ఏళ్ల బాలుడిని శివరాజ్ అనే వ్యక్తి హత్య చేశాడు. అనంతరం అత‌డు కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. ఐదు రోజుల క్రితం తెల్లాపూర్‌కు శివరాజ్, చంద్రకళ అనే ఇద్దరు వచ్చి తమను తాము భార్యాభర్తలుగా పరిచయం చేసుకుని ఇల్లు అద్దెకు తీసుకున్నారు. వీరితో పాటు 13 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

స‌డెన్‌గా గురువారం శివరాజ్.. చంద్రకళను, 13 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని శివరాజ్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అత‌డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చంద్రకళ, బాలుడి హత్యలకు సంబంధించిన కారణాలు తెలియరావాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story