విషాదం.. పుట్టిన రోజు నాడు ప్ర‌సంగిస్తూ స్వామీజి క‌న్నుమూత‌

Sanganabasava Swamiji died due to heart attack.ఎవ‌రు ఎప్పుడు ఎలా మ‌ర‌ణిస్తారో ఎవ్వ‌రు చెప్ప‌లేరు. అంత వ‌ర‌కు అంద‌రితో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Nov 2021 8:18 AM IST
విషాదం.. పుట్టిన రోజు నాడు ప్ర‌సంగిస్తూ స్వామీజి క‌న్నుమూత‌

ఎవ‌రు ఎప్పుడు ఎలా మ‌ర‌ణిస్తారో ఎవ్వ‌రు చెప్ప‌లేరు. అంత వ‌ర‌కు అంద‌రితో పాటు మాట్లాడుతున్న వ్య‌క్తి క్ష‌ణాల్లో కుప్ప‌కూలి ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు చూశాం. తాజాగా ఓ స్వామీజి.. భ‌క్తుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తూనే మ‌ర‌ణించారు. పుట్టిన రోజు నాడే స్వామీజి మ‌ర‌ణించిన విషాద ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ నెల 6న ఈ ఘ‌ట‌న జ‌రుగ‌గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెళితే.. బెళ‌గావి జిల్లాలోని బ‌లోబ‌ల మ‌ఠం పీఠాధిప‌తి సంగ‌న‌బ‌స‌వ మ‌హా స్వామీజి(54) త‌న జ‌న్మ‌దిన సంద‌ర్భంగా వేడుక‌ల‌కు హాజ‌రైన భ‌క్తుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం ప్రారంభించారు. స్వామీజి చెబుతున్న ప్ర‌వ‌చ‌నాల‌ను భ‌క్తులు శ్రద్ద‌గా వింటున్నారు. ప్ర‌వ‌చ‌నాలు చెబుతూనే స్వామీజి ఒక్క‌సారిగా కుర్చీలోనే కుప్ప‌కూలారు. దీంతో అక్కడ అలజడి రేగింది. స్వామీజీకి ఏమైందో తెలియక అంతా కంగారుపడ్డారు. వెంట‌నే ప‌క్క‌న ఉన్న‌వారు స్వామీజిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే ఆయ‌న మృతి చెందిన‌ట్లు వైద్యులు చెప్పారు. గుండెపోటుతో స్వామీజి క‌న్నుమూశార‌ని తెలిపారు. స్వామీజి ప్ర‌సంగాన్ని త‌మ సెల్‌ఫోన్‌ల‌లో కొంద‌రు భ‌క్తులు చిత్రీక‌రిస్తుండ‌గా.. ఈ ఘ‌ట‌న కూడా అందులో రికార్డు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story