వీడియోలను చూపిస్తూ.. ఏడాదిగా లైంగికంగా వేధించాడు

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరేందర్ బహదూర్ పాల్‌ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి.

By అంజి  Published on  8 Sept 2024 7:01 PM IST
Samajwadi Party leader, raping lawyer, blackmailing, Crime

వీడియోలను చూపిస్తూ.. ఏడాదిగా లైంగికంగా వేధించాడు 

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మాజీ రాష్ట్ర కార్యదర్శి వీరేందర్ బహదూర్ పాల్‌ పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఆయనకు సహాయకురాలిగా పనిచేసిన మహిళా న్యాయవాదిపై అత్యాచారం చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. మౌ బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ అయిన పాల్ అసిస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరేందర్ బహదూర్ పాల్‌ వీడియోలు ఫోటోలను ఉపయోగించి తనను బ్లాక్‌మెయిల్ చేసి గత ఏడాది కాలంగా లైంగికంగా వేధించాడని బాధిత మహిళ ఆరోపించింది. పాల్ తనను పదే పదే బెదిరించాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

మౌ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేసిన పాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పరారీలో ఉన్నాడు. పోలీసులు పూర్తి విచారణ ప్రారంభించి బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదు చేసిన మహిళకు కోర్టు ఆవరణలో రెండు రోజుల క్రితం పాల్‌తో గొడవకు దిగిందని నివేదికలు సూచిస్తున్నాయి. సెప్టెంబర్ 7 న, బాధితురాలు తనకు ఎదురైన లైంగిక వేధింపులు, శారీరక హింస, బెదిరింపులకు సంబంధించి ఫిర్యాదును నమోదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా, తగిన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని మౌ సిటీ సర్కిల్ ఆఫీసర్ (CO) అంజనీ కుమార్ పాండే తెలిపారు.

Next Story