తల్లిని చంపడానికి సుపారీ కిల్లర్ ను మాట్లాడుకున్న 14 ఏళ్ల బాలిక

Russian teen suspected of hiring hitman to kill mom after being told to break up with boyfriend. రష్యా పోలీసులు 14 ఏళ్ల బాలికను అరెస్టు చేశారు. ఆ బాలికకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు.

By M.S.R  Published on  4 April 2023 8:14 PM IST
తల్లిని చంపడానికి సుపారీ కిల్లర్ ను మాట్లాడుకున్న 14 ఏళ్ల బాలిక

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


రష్యా పోలీసులు 14 ఏళ్ల బాలికను అరెస్టు చేశారు. ఆ బాలికకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ విషయం ఆమె తల్లికి నచ్చలేదు. తన బాయ్‌ఫ్రెండ్‌ను చూడకుండా అడ్డుకుంటున్న తన తల్లిని చంపడానికి సుపారీ కిల్లర్ ను నియమించుకుంది. దీంతో 14 ఏళ్ల పాఠశాల బాలికను అరెస్టు చేశారు. రష్యాలోని మాస్కో సమీపంలో మహిళ తల్లి మృతదేహం కనిపించింది. ఆమెను అత్యంత కిరాతకంగా సుపారీ కిల్లర్ తో చంపించింది. ఆమెను కొట్టి, గొంతుకోసి, మృతదేహాన్ని ప్లాస్టిక్‌ కవర్ లో చుట్టి పడేశారు.

ది సన్ నివేదిక ప్రకారం బాలిక బాయ్ ఫ్రెండ్ అయిన 15 ఏళ్ల బాలుడు కూడా ఈ దారుణంలో భాగమయ్యాడు. అతడితో కలిసి తన తల్లిని చంపడానికి సుపారీ ఇచ్చిందని తెలుస్తోంది. హత్య కోసం రూ. 3,72,202(భారత కరెన్సీలో) ఖర్చు చేశారు. ఇద్దరు టీనేజర్లకు ఆ డబ్బులు ఇచ్చి 38 ఏళ్ల బాధితురాలిని చంపించారని రష్యా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ అబ్బాయిని వదిలేయాలని కుమార్తెను తల్లి పదే పదే కోరింది. అది నచ్చకపోవడంతో ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశారు. చెత్తాచెదారంలో మృతదేహాన్ని పడేశారు. కొందరు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేసి బాధితురాలు అనస్తాసియాను కుమార్తె చంపించిందని నిర్ధారించారు.


Next Story