ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బ‌స్సు.. 24 మందికి గాయాలు

RTC Bus Collide with lorry in Nizamabad District.ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 24 మంది

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 15 April 2022 8:01 AM IST

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బ‌స్సు.. 24 మందికి గాయాలు

ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 24 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా మెండోరా మండ‌లం బుస్సాపూర్ వ‌ద్ద చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ఐదుగురు ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది ప్ర‌యాణీకులు ఉన్నారు. మిగిలిన వారిని వేరే బ‌స్సులో గ‌మ‌స్థానానికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story