Telangana: రూ.2.33 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో రహస్యంగా ఏర్పాటు చేసుకున్న కంపెనీల్లో డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారు

By Srikanth Gundamalla  Published on  23 March 2024 1:15 PM IST
rs 2.33 crore, drugs, telangana, dca ,

Telangana: రూ.2.33 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది. రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ తెలంగాణగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈమేరకు పోలీసు అధికారులు పలు సూచనలు చేశారు. డ్రగ్స్‌ సరఫరా చేస్తూ నిందితులు పట్టుబడితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు.. సోదాలు విస్తృతంగా నిర్వహిస్తూ... డ్రగ్స్ అక్రమ దందా దారులపై ఓ కన్నేసి ఉంచాలని చెప్పారు. ఈ మేరకు డ్రగ్స్ చీకటి దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో రహస్యంగా ఏర్పాటు చేసుకున్న కంపెనీల్లో డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారు. నిన్నటికి నిన్న డ్రగ్స్‌ కంట్రోల్ అధికారులు బోల్లారంలోని ఓ కంపెనీపై దాడి చేసి పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను సీజ్ చేవారు. ఈ సంగటన మర్చిపోకముందే మరో కంపెనీలో డీసీఏ అధికారులు సోదాలు చేయగా.. మళ్లీ భారీ ఎత్తున డ్రగ్స్‌ను గుర్తించారు. రెండ్రోజుల్లోనే ఏకంగా రూ.2 కోట్లకు పైగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్పారు.

సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం బొల్లారంలో శుక్రవారం medchem labs పై రైడ్ చేశారు డీసీఏ అధికారులు. అక్కడ రూ.1.19 కోట్ల విలువైన 2.850 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా శనివారం కూడా డీసీఏ అధికారులు సోదాలు కొనసాగించారు. రంగారెడ్డి జిల్లా మాంకాల్‌లోని వనమాలి ఆర్గానిక్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోదాలు చేశారు. అక్కడ కూడా 11.5 కిలోల 3-ఎంఎంసి విలువ రూ. 1.14 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ రెండ్రోజుల్లోనే మొత్తం రూ.2.33 కోట్ల విలువైన 3mmc and Alpha -pihp డ్రగ్స్ ను స్వాధీనపరచుకున్నారు. ఈ విధంగా ఆయా కంపెనీలు రహస్యంగా డ్రగ్స్‌ను తయారు చేసి యూరోపియన్ దేశాలకు పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు సంఘటనపై కేసు నమోదు చేశామనీ దర్యాప్తు లోతుగా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా డ్రగ్స్‌ను రహస్యంగా తయారు చేసే కంపెనీలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అనే దానిపై ఫోకస్ పెట్టారు. అలాంటి వారిపై చర్యలు తప్పవని చెప్పారు.

Next Story