సింగరేణి గనిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు దుర్మరణం
Roof Collapses in Srirampur Singareni Mine 4 workers died.సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు గని
By తోట వంశీ కుమార్ Published on
10 Nov 2021 10:39 AM GMT

సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. బొగ్గు గని పై కప్పు కూలింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్రీరాంపూర్‌లోని ఎస్ఆర్పీ 3 గనిలో బుధవారం మొదటి షిఫ్ట్‌లో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పై కప్పు కూలింది. ఈ ప్రమాదంలో కార్మికులు కృష్ణారెడ్డి(59), లక్షయ్య(60), చంద్రశేఖర్(29), నర్సింహరాజు(30) మృతి చెందారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సింరేణి రెస్కూ బృందం పనిచేస్తోంది. భారీ శిథిలాలు కావడంతో సహాయక చర్యలకు కాస్త ఇబ్బందిగా మారింది. మైన్‌లో బొగ్గు వెలికి తీస్తుండగా 21 డీప్ 24 లెవెల్ వద్ద రూఫ్ కూలడంతో ప్రమాదం జరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై సింగరేణి కార్మికుల కుటుంబాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Next Story