అప్పటికే పని మనిషి కాళ్లు, చేతులు కట్టేసిన దొంగలు.. లాయర్ భార్య అడ్డుపడగా

Robbers killed advocates wife in Kanpur.కాన్పూర్‌కు చెందిన సీనియర్ న్యాయవాది విశ్వనాథ్ కపూర్ భార్య హత్యకు గురైంది.

By M.S.R  Published on  16 Feb 2022 6:41 AM GMT
అప్పటికే పని మనిషి కాళ్లు, చేతులు కట్టేసిన దొంగలు.. లాయర్ భార్య అడ్డుపడగా

కాన్పూర్‌కు చెందిన సీనియర్ న్యాయవాది విశ్వనాథ్ కపూర్ భార్య హత్యకు గురైంది. నగరంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరైన విశ్వనాథ్ కపూర్ ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. పనిమనిషి చేతులు, కాళ్లు కట్టేసి దొంగలు దోపిడికి పాల్పడ్డారు. ఇంతలో లాయర్ భార్య వచ్చి అడ్డుకోవడంతో దొంగలు ఆమెను హత్య చేశారు.

కాన్పూర్‌లోని స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంకర్డ్ అపార్ట్‌మెంట్‌లో మధు కపూర్ ను హత్య చేసి లక్షల రూపాయలు దోచుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఫ్లాట్ నెం. 307 లో మధు కపూర్ నివసిస్తూ ఉన్నారు. సావిత్రి అనే పనిమనిషి ఆమెతో ఉన్నారు. సోమవారం రాత్రి, అగంతకులు ఫ్లాట్‌కు చేరుకుని తలుపు తెరవమన్నారు. లోపలికి ప్రవేశించిన వెంటనే దొంగలు పనిమనిషి సావిత్రిని బాత్‌రూమ్‌లోకి లాక్కెళ్లి ఇంట్లో దోచుకోవడం ప్రారంభించారు. మధు ప్రతిఘటించడంతో దుండగులు గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం నగదు, నగలు తీసుకుని పరారయ్యారు. దొంగలు తన చేతులు, కాళ్లు కట్టేసి గదిలో బంధించారని పనిమనిషి చెప్పింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏడీసీపీ తెలిపారు. కొందరు అనుమానితులకు సంబంధించిన సమాచారం సీసీటీవీలో కనిపించిందని, వారి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు.

Next Story
Share it