వ‌రంగ‌ల్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ఆర్టీసీ బ‌స్సును ఢీ కొన్న లారీ

Road Accident in Warangal District.వరంగ‌ల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఇసుక లారీ అదుపు త‌ప్పి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2021 5:25 AM GMT
వ‌రంగ‌ల్ జిల్లాలో  ఘోర ప్ర‌మాదం.. ఆర్టీసీ బ‌స్సును ఢీ కొన్న లారీ

వరంగ‌ల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఇసుక లారీ అదుపు త‌ప్పి ఆర్టీసీ బ‌స్సును ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 20 మంది ప్ర‌యాణీకుల‌కు తీవ్ర‌గాయాలు కాగా.. మ‌రో 10 మందికి స్వ‌ల్ప‌గాయాలు అయ్యాయి. శాయంపేట మండ‌లం మందారిపేట శివారులో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

పరకాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో భూపాలపల్లికి వెళ్తోంది. మందారి పేట శివారులో ఎదురుగా వ‌స్తున్న ఇసుక లారీ అదుపు త‌ప్పి ఆర్టీసీ బ‌స్సును ఢీ కొట్టింది. ఇసుక లారీ వేగంగా ఢీ కొట్ట‌డంతో బ‌స్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్ర‌మాదంలో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ‌గా.. మ‌రో 10 మంది స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న అధికారులు, పోలీసులు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ప‌ర‌కాల‌ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇసుక లారీ డ్రైవర్‌ అతివేగంగా వాహనాన్ని నడిపిన కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it