రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు విద్యార్థినులు మృతి

Road Accident in Vizianagarm Dist.విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sep 2021 5:11 AM GMT
రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు విద్యార్థినులు మృతి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని లారీ ఢీ కొట్టింది. ఈప్ర‌మాదంలో ఇద్ద‌రు విద్యార్థినులు అక్క‌డిక్క‌డే ప్రాణాలు కోల్పోగా.. బైక్ న‌డుపుతున్న మ‌రో వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న శ‌నివారం ఉదయం చీపురుప‌ల్లి మెయిన్ రోడ్డు(విజ‌య‌న‌గ‌రం-పాల‌కొండ‌)పై చోటుచేసుకుంది.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. క్ష‌త‌గాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతి చెందిన ఇద్ద‌రు బాలిక‌ల‌ను జ్ఞానేశ్వరి, చంద్రిక యోషితగా గుర్తించారు. పాఠ‌శాల‌కు వెలుతుండ‌గా ఈప్ర‌మాదం జ‌రిగింది. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it