ఘోర ప్ర‌మాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బొలెరో.. ముగ్గురి మృతి

Road Accident in Tuni three dead.ఆగి ఉన్న లారీని బొలెరో వాహ‌నం ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Sept 2022 12:32 PM IST
ఘోర ప్ర‌మాదం.. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బొలెరో.. ముగ్గురి మృతి

ఆగి ఉన్న లారీని బొలెరో వాహ‌నం ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మ‌రో 9 మంది గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న కాకినాడ జిల్లా తుని మండ‌లం వెల‌మ కొత్తూరు జాతీయ ర‌హ‌దారిపై గురువారం తెల్ల‌వారుజామున జ‌రిగింది. స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

వీరంతా కోరుకొండ మండలం శ్రీరంగ పట్నం చెందిన వారిగా గుర్తించారు. విశాఖ‌లోని భీశెట్టివారి వీధి వ‌ద్ద ఏర్పాటు చేసిన వినాయ‌క చ‌వితి ముగింపు ఉత్స‌వాల్లో వీరి బృందం నాట‌క ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది. ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం తిరుగు ప్ర‌యాణంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఘ‌ట‌నా స్థ‌లంలో ఒక‌రు చనిపోగా.. చికిత్స పొందుతూ మ‌రో ఇద్ద‌రు మృతి చెందారు. క్ష‌త‌గాత్రుల్లో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించారు. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story