శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. బస్సు,కారు ఢీ
Road accident in Srisailam GhatRoad.శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టింది.
By తోట వంశీ కుమార్ Published on
27 Jun 2021 6:37 AM GMT

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా డోర్నాల నుంచి వస్తున్న కారు.. శ్రీశైలం నుంచి ధర్మవరం వైపు వెలుతున్న ఆర్టీసీ బస్సు చిన్న ఆరుట్ల సమీపంలో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కారులోంచి గాయపడిని వారిని బయటకు తీసి సున్నిపెంటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కడప జిల్లా పులివెందుకు చెందిన గంగాభవాని, ఆది నారాయణరెడ్డి, సుగుణ, శారద, అశోక్‌రెడ్డిగా గుర్తించారు. వీరంతా బంధువుల ఇంట్లో వివాహానికి హాజరైన అనంతరం తిరుగుప్రయాణంలో శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story