సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ఢీ కొన్న కంటైనర్
Road accident in Sangareddy district.సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కంటైనర్‌ను ఢీ కొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
By తోట వంశీ కుమార్ Published on
14 March 2021 9:46 AM GMT

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కంటైనర్‌ను ఢీ కొనడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అందోలు మండలం అల్మాయిపేట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సంఘటనా స్థలంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రధాన రహదారిపై యాక్సిడెంట్ కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Next Story