ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

Road Accident in Prakasam District five died.ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రోడ్డుపై ప‌డి ఉన్న గేదె

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Aug 2021 2:23 AM GMT
ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రోడ్డుపై ప‌డి ఉన్న గేదె క‌ళేబ‌రంపై ఆటో ఎక్క‌డంతో అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెంద‌గా.. మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. వివ‌రాల్లోకి వెళితే.. ద‌ర్శి గ్రామానికి చెందిన కొంద‌రు టాటా మ్యాజిక్ వాహ‌నంలో బేస్త‌వారిపేట మండ‌లం కొత్త‌ప‌ల్లిలో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా.. తుర్లపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద రోడ్డు పై ప‌డి ఉన్న గేదె క‌ళేబ‌రంపైకి టాటా మ్యాజిక్ ఎక్కింది. దీంతో వాహ‌నం అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది.

ఈ ప్ర‌మాదంలో ఘ‌ట‌నా స్థ‌లంలోనే ఐదుగురు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న‌పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జరిగిన స‌మ‌యంలో ఆటోలో 14 మంది ఉన్నారు. చ‌నిపోయిన వారిని పొట్ల‌పాటి సార‌మ్మ‌, గొంగ‌టి మార్త‌మ్మ‌, ఇత్త‌డి లింగ‌మ్మ‌, కోట‌మ్మ‌, ఆటో డ్రైవ‌ర్ వెంక‌టేశ్వ‌ర‌రెడ్డిగా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it