రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు

Road accident in nirmal district.. Injuries to 30 people. తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా

By అంజి  Published on  7 March 2022 12:41 PM GMT
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు

తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్‌ దగ్గర జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. భైంసా నుండి నిర్మల్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. అదే రోడ్డులో వెనుక నుండి వచ్చిన మరో ఆర్టీసీ బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో 10 మంది తీవ్రంగా గాయపడగా, మరో 20 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి వచ్చారు. గాయపడిన వారిని వెంటనే అంబులెన్స్‌లో భైంసా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు మహిళలకు కాళ్లు విరిగాయి. దీంతో వారిని మెరుగైన చికిత్స కోసం నిర్మల్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it