న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

Road Accident in Nalgonda District two dead.న‌ల్ల‌గొండ జిల్లా కేతేప‌ల్లి మండ‌లంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Dec 2022 8:56 AM IST
న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

న‌ల్ల‌గొండ జిల్లా కేతేప‌ల్లి మండ‌లంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఇనుపాముల స్టేజీ వ‌ద్ద ఓ కారు అదుపు త‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ కొట్టి బోల్తా ప‌డింది. దీంతో కారులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. అందులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

క్ష‌త‌గాత్రులను న‌కిరేక‌ల్‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. అనంత‌రం మెరుగైన చికిత్స కోసం నార్కెట్‌ప‌ల్లి కామినేని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో కారులో ఐదుగురు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మృతుల‌ను త‌ల్లి క‌రుణ‌, కొడుకు ఫ‌ణికుమార్‌గా గుర్తించారు. హైద‌రాబాద్ నుంచి సూర్యాపేట వెలుతుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బాధితులు అంతా సూర్యాపేట‌కు చెందిన గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story