చెట్టును ఢీ కొన్న కారు.. నలుగురు దుర్మరణం
Road accident in Manakondur 4 Died.అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అధికారులు
By తోట వంశీ కుమార్ Published on 26 Nov 2021 3:01 AM GMT
అతివేగం, నిర్లక్ష్యం కారణంగా ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఓ కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు దుర్మరణం చెందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్ద చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మృతులను కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ఖమ్మం జిల్లాలోని కల్లూరులో దశదిన కర్మకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు బావిస్తున్నారు.