కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Road Accident In Krishna District. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. జింజేరు గ్రామానికి చెందిన
By Medi Samrat Published on
28 March 2021 10:44 AM GMT

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. జింజేరు గ్రామానికి చెందిన 12 మంది కూలీ పనుల నిమిత్తం వడ్లమన్నాడు గ్రామానికి ఆటోలో బయల్దేరారు. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామశివారులో ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మరణించగా.. మరో 9 మందికి గాయాలయ్యాయి.
ఆటో డ్రైవర్ లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Next Story