ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 17 మంది మృతి

Road accident in kanpur.ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మంగ‌ళ‌వారం రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. బ‌స్సు,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2021 7:25 AM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. 17 మంది మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మంగ‌ళ‌వారం రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. బ‌స్సు, జేసీబీ ఢీ కొన్నాయి. ఈ ఘ‌న‌ట‌లో 17 మంది మృత్యువాత ప‌డ‌గా.. 24మందికి పైగా గాయప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కాన్పూర్ కు స‌మీపంలోని స‌చేండి జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణీకుల‌తో బ‌స్సు ల‌క్నో నుంచి ఢిల్లీకి వెలుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. ఘ‌ట‌నాస్థ‌లంలోనే ప‌లువురు మృతి చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు.

కాన్పూర్ ఐజీ మోహిత్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ.. కాన్పూర్ స‌మీపంలోని స‌చెంది వ‌ద్ద ఓ మిని బ‌స్సు జేసీబీని ఢీకొని బ్రిడ్జి పై నుంచి కింద‌ప‌డింద‌ని, 17 మంది మ‌ర‌ణించగా.. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలిపారు. ఆ స‌మ‌యంలో బ‌స్సు చాలా వేగంగా వెలుతున్న‌ట్లు చెప్పారు.

ఈ ప్ర‌మాద విష‌యం తెలుసుకున్న ఉత్త‌ర‌ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. మృతిచెందిన వారి కుటుంబ స‌భ్యుల‌కు రూ.2ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. త‌క్ష‌ణ‌మే ప్ర‌మాదం పై విచార‌ణ చేయాల్సిందిగా అధికారుల‌ను ఆదేశించారు.

ప్ర‌మాదంలో మర‌ణించిన వారికి ప్ర‌ధాని మోదీ సంతాపం తెలిపారు. పీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మృతుల కుటుంబాల‌కు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Next Story