ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కుమారుడితో సహా దంపతుల దుర్మరణం

Road Accident in I Polavaram Mandal three dead.తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది.బైక్ ను వ్యాన్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Feb 2022 2:59 PM IST
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కుమారుడితో సహా దంపతుల దుర్మరణం

తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బైక్ ను వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు అయ్యాయి. వివ‌రాల్లోకి వెళితే.. తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఐ.పోల‌వ‌రం మండ‌లం గుత్తిన గ్రామంలో వైదాడి కుమార్ (32), పద్మ (27) దంప‌తులు నివ‌సిస్తున్నారు. వీరికి హర్ష (10), హర్షిత, లక్కీ సంతానం. కాగా.. ఆదివారం ఉద‌యం వీరంతా బైక్‌పై రాజ‌మండ్రి వైపు వెలుతుండ‌గా.. యానం ఎదుర్లంక జీఎంసీ బాల‌యోగి వార‌ధిపై ఓ వ్యాన్ వీరి బైక్‌ను ఢీ కొట్టింది.

ఈ ఘ‌ట‌న‌లో భార్యాభ‌ర్త‌లు వైదాడి కుమార్, పద్మ ల‌తో పాటు వారి కుమారుడు హ‌ర్ష అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. హ‌ర్షిత‌, ల‌క్కీ చిన్నారుల‌కు గాయాలు అయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన చిన్నారుల‌కు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో యానాం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వ్యాన్ డ్రైవ‌ర్ అతి వేగం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్థానికులు అంటున్నారు. ఈ ప్రమాదంతో వంతెనపై ట్రాఫిక్ జామ్‌ అయింది.

Next Story