గుజ‌రాత్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కూలీల‌పైకి దూసుకెళ్లిన లారీ.. 15 మంది మృతి

Road accident in Gujarat.గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాతి పనిచేసుకుని బ్ర‌తుకుతున్న కూలీల‌పైకి దూసుకెళ్లిన లారీ.. 15 మంది మృతి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jan 2021 8:43 AM IST
Road accident in Gujarat.

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాతి పనిచేసుకుని బ్ర‌తుకుతున్న ఆ కూలీల జీవితాలు నిద్ర‌లోనే తెల్లారిపోయాయి. పుట్‌పాత్‌పై నిద్ర‌స్తున్న వారిపై నుంచి ఓ ట్రక్ దూసుకెళ్లిపోయింది. సూరత్‌లోని కోసాంబా అనే ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను సూర‌త్ త‌ర‌లించి చికిత్స అంద‌జేస్తున్నారు. వీరంతా రాజ‌స్థాన్‌లోని బాన్స్‌వాడా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ట్రక్కు డ్రైవర్ నిద్ర మత్తులో వాహనం నడపడం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్న‌ట్లు భావిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. కోసంబిలోని ఓ ప్ర‌ధాన కూడ‌లి నుంచి మాండ్వివైపు లారీ వేగంగా వెలుతోంది. ఈ క్ర‌మంలో ఎదురుగా చెరుకు లోడ్‌తో వ‌స్తున్న ట్రాక్ట‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో డ్రైవ‌ర్ నియంత్ర‌ణ కోల్పోయి పుట్‌పాత్ వైపు మ‌ళ్లించాడు. ఆ పుట్‌పాత్‌పై నిద్రిస్తున్న 18 మంది కార్మికుల‌పై నుంచి లారీ దూసుకెళ్లింది. ఇందులో 12 మంది అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోరు. మ‌రో ముగ్గురు ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు.





Next Story