తూర్పుగోదావ‌రి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

Road accident in East Godavari District.తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Sept 2021 12:38 PM IST
తూర్పుగోదావ‌రి జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మృతి

తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే మృతి చెంద‌గా.. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. శంఖ‌వ‌రం మండ‌లం క‌త్తిపూడి వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. రాజ‌మ‌హేంద్రవ‌రం నుంచి విశాఖ వైపు వెలుతున్న కారు క‌త్తిపూడి వ‌ద్ద జాతీయ‌ర‌హ‌దారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. కారులో ఇరుకున్న ముగ్గురిని బ‌య‌ట‌కు తీశారు. వారు గాయ‌ప‌డ‌డంతో చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మ‌రో ఇద్ద‌రు ఘ‌ట‌నా స్థ‌లంలోనే మృతి చెందారు. మృతుల‌ను ప‌ట్నాల రాము, ర‌మ‌ణ‌(21)గా గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story