ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

Road Accident in Choutuppal three dead.యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బైక్‌ను లారీ ఢీ కొట్టింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Aug 2021 3:15 AM GMT
ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై ప్ర‌యాణిస్తున్న ముగ్గురు అక్క‌డిక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ‌నివారం తెల్ల‌వారుజామున‌ చౌటుప్ప‌ల్ మండ‌లంలోని ధ‌ర్మోజిగూడెం స‌మీపంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతుల్లో న‌ల్ల‌గొండ జిల్లా చిట్యాల మండ‌లం పిట్టంప‌ల్లికి చెందిన హ‌రీశ్ కాగా.. మిగిలిన ఇద్ద‌రు హైద‌రాబాద్ రామాంతాపూర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ముగ్గురు హైదారాబాద్‌లో ఏసీ మెకానిక్‌లుగా ప‌నిచేస్తున్నారు.

హ‌రీశ్ స్వ‌గ్రామంలో జ‌రిగిన ఓ పెళ్లి శుక్ర‌వారం వీరు హాజ‌ర‌య్యారు. అనంర‌తం రాత్రి 2.30గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు తిరుగు ప్ర‌యాణం అయ్యారు. ఈ క్ర‌మంలో ధ‌ర్మోజీగూడెంలో ఉన్న వేబ్రిడ్జి వ‌ద్ద ఓ లారీ రివ‌ర్స్ చేస్తుండ‌గా వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఘ‌ట‌నాస్థ‌లంలోనే వీరు మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. ప్ర‌మాదంపై ఆరా తీశారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. దీనిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it