చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. దంప‌తులు స‌హా చిన్నారి మృతి

Road accident in chittoor district.చిత్తూరు జిల్లాలో శ‌నివారం అర్థ‌రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మదనపల్లిలోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 May 2021 3:20 AM GMT
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. దంప‌తులు స‌హా చిన్నారి మృతి

చిత్తూరు జిల్లాలో శ‌నివారం అర్థ‌రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. మదనపల్లిలోని బిస్కెట్‌ ఫ్యాక్టరీ దగ్గర బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న దంప‌తుల‌తో స‌హా వారి రెండేళ్ల చిన్నారి మృతిచెందారు. వివ‌రాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క రాష్ట్రం శ్రీనివాస‌పురం తాలుకా రాయ‌ల‌పాడు స‌మీపంలోని వేప‌న‌పల్లెకు చెంది న‌రేష్‌(35), భార్య ఉమాదేవి(26), కుమారై నిషిత (5) తో క‌లిసి మ‌ద‌న‌ప‌ల్లె ప‌ట్ట‌ణంలోని పుంగ‌నూరు రోడ్డులో నివాసం ఉంటున్నాడు.

ఓ చికెన్ సెంట‌ర్‌లో న‌రేష్ కూలీగా ప‌నిచేస్తున్నాడు. లాక్‌డౌన్ స‌మ‌యం కావ‌డంతో త‌ల్లిదండ్రుల‌ను చూసి రావ‌డానికి భార్య‌, కుమారైతో క‌లిసి శుక్ర‌వారం ఉద‌యం క‌ర్ణాట‌కు వెళ్లాడు. ఆదివారం చికెన్ వ్యాపారం దెబ్బ‌తిన‌కూడ‌ద‌ని.. శ‌నివారం రాత్రి తిరిగి మ‌ద‌న‌ప‌ల్లెకు బ‌య‌లు దేరాడు. వ‌ర్షం కురుస్తున్న‌ప్ప‌టికి ఎక్క‌డా ఆగ‌లేదు. మ‌ద‌న‌ప‌ల్లె స‌మీపంలోని బెంగ‌ళూరు బిస్కెట్ ఫ్యాక్ట‌రీ వ‌ద్ద వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన గుర్తు తెలియ‌ని వాహానం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో దంప‌తులు స‌హా వారి రెండేళ్ల చిన్నారి అక్క‌డిక్క‌డ‌కే మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story
Share it